ఖైరతాబాద్ ఉపఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ ప్రభావం ఖైరతాబాద్‌లో ఉండదని పేర్కొన్నారు. ఖైరతాబాద్ బైపోల్స్‌లో దిమ్మతిరిగే రిజల్ట్ వస్తుందని వెల్లడించారు. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అలా ఉంటుంది అంటూ పోకిరి సినిమా డైలాగ్‌ను ప్రస్తావించారు. అదే సమయంలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి గెలుపుపైనా ఆరోపణలు చేశారు.