ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేక అన్ని పంటలు అల్లాడిపోతున్నాయి. సాధారణం కంటే చాలా తక్కువ పడిన వర్షాలకు.. పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలోనే సీతాఫలంపైనా ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు సరిగా కురవక.. సీతాఫలం పంట మార్కెట్‌లో భారీ ధర పలుకుతోంది. యాపిల్ పండ్లతో పోటీ పడుతోంది. కిలో రూ.200 పలకడంతో.. సామాన్యులకు ఈ సీజనల్ ఫ్రూట్ అందుబాటులో లేకుండా పోతోంది. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేకపోవడం, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే చెట్లను కూడా తీసివేస్తుండటంతో సీతాఫలం కనిపించకుండా పోతోంది.