సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నా ఎందుకు ఆందోళన చేపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి డీఎస్‌బీవీ స్వామి అన్నారు. ఇప్పటికే 15 వేలమందికిపైగా ప్రమోషన్లు ఇచ్చామని, ఇతర డిమాండ్లపై దృష్టి సారించామని, అయినా సరే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. ఇదే సందర్భంలో సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం అసాధ్యమని డీఎస్‌బీవీ స్వామి తేల్చి చెప్పారు. ఉద్యోగులు పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు.