దిశ ఘటన జరిగిన ప్రాంతంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నం

1 hour ago 1
హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ పరిధిలో మహిళపై క్యాబ్‌ డ్రైవర్‌ లైంగికదాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మహిళ క్యాబ్‌లో శంషాబాద్‌ వెళ్తుండగా.. డ్రైవర్‌ 'దిశ' ఘటన జరిగిన ప్రాంతమైన తుండుపల్లి వద్ద రూటు మార్చి కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించడంతో బాధితురాలు కేకలు వేస్తూ క్యాబ్‌ నుంచి దిగింది. డ్రైవర్‌ ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదుతో కూడిన బ్యాగును లాక్కొని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article