ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనం పూర్తయింది. 70 అడుగుల భారీ సప్తముఖ మహాశక్తి గణనాథుడుని.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు తరించిపోయారు.