వైఎస్ఆర్ జిల్లా గండికోట అభివృద్ధికి చకా చకా అడుగులు పడుతున్నాయి. గండికోటలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే గండికోటలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్ల విలువైన గండికోట టూరిజం ప్రాజెక్టు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గండికోట టూరిజం ప్రాజెక్టుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆమోదం తెలిపిందన్న పెమ్మసాని చంద్రశేఖర్.. ఇందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.