Vasantha Krishna Prasad On Budameru: జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతోనే వరదముంపు అన్నారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్రూ. .220 కోట్ల బుడమేరు ఆధునికీకరణ పనులు అటకెక్కించారని.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది టెర్రరిజం కంటే మరింత ప్రమాదకరమని.. బీడీసీకి పడిన గండ్లు యుద్ధప్రాతిపదికన పూడ్చివేశారన్నారు. తనపై ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బుడమేరును పట్టించుకున్న పాపానపోలేదన్నారు.