తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) అదృశ్యమైనట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 4వ తేదీన ఇల్లు వదిలి వెళ్లిన ఆమె ఇప్పటివరకు తిరిగి రాలేదు. కాగా, ఈ అదృశ్యం వెనుక సతీష్, సత్యనారాయణ, కుమారి అనే ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు.