గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ ఇబ్బంది తలెత్తడంతో గాలిలోనే విమానం చక్కర్లు కొట్టింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 9 గంటలైనా రోడ్లపై దట్టమైన పొగ మంచు ఉండటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.