కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఎయిర్‌పోర్టులో సాధారణంగా నిర్వహించే చెకింగ్‌లో బీటెక్ విద్యార్థి బ్యాగులో రెండు బుల్లెట్లు గుర్తించారు. అవి చూసి అలర్ట్ అయిన చెకింగ్ సిబ్బంది.. వెంటనే పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ బీటెక్ స్టూడెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ స్టూడెంట్ వద్దకు బుల్లెట్లు వచ్చాయి, వాటిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.