ప్రభుత్వ పాలనలో సాంకేతికతను వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణి మహిళల కోసం జననీ మిత్ర పేరుతో యాప్ తీసుకురానుంది. జననీ మిత్ర యాప్‌ను ప్రస్తుతం అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఎదురయ్యే లోటుపాట్లను సరిచేసుకుని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ జననీ మిత్ర యాప్ అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ యాప్ ద్వారా గర్భిణుల ఆరోగ్యం, మందుల వివరాలు, ప్రభుత్వ ప్రయోజనాలను ట్రాక్ చేయవచ్చు.