గాంధీలో అందుబాటులోకి అత్యాధునిక వైద్యం.. ఇక ఆ చికిత్సలన్నీ ఫ్రీనే.. వేల రూపాయలు ఆదా

9 months ago 23
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీర్ఘకాలిక నొప్పులకు ఉపశమనం కలిగించే ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్‌ను ప్రారంభించారు. భుజం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు ఈ విధానంలో చికిత్స అందించారు. ఈ చికిత్సలో ఇంజెక్షన్లు మాత్రమే వాడతారని, శస్త్రచికిత్సలు ఉండవని వైద్యులు తెలిపారు. ప్రైవేటులో వేలకు వేలు ఖర్చయ్యే ఈ చికిత్సను గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్నారు. ఓపీ విభాగంలో సోమవారం నుంచి శనివారం వరకు పెయిన్ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Read Entire Article