తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన గాజువాక మౌనిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నేవీ ఉద్యోగి రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాథమిక విచారణలో డబ్బు డిమాండ్ చేస్తోందని హత్య చేసినట్లు రవీంద్ర చెప్పినట్లు సమాచారం. మరోవైపు హత్యకు ముందుగానే ప్లాన్ చేసుకున్న రవీంద్ర ఆన్‌లైన్‌లో కత్తులు కొనుగోలు చేశాడు. హత్య తర్వాత రక్తపు వాసన రాకుండా ఇంట్లో సెంట్ కొట్టినట్లు తెలిసింది.