తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు, వారికి ప్రత్యేక సంక్షేమ నిధి, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని ఆదేశించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో.. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, వారి డేటాను ఆన్‌లైన్ చేయాలని సూచించారు. ఈ చర్యలు గిగ్ కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతకు దోహదపడి, తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.