గుంటూరులోని ఏటుకూరు బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మహిళా ఐపీఎస్ అధికారి షిరిన్ బేగం కుమార్తె చనిపోయారు. ఆదివారం కావటంతో స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో షిరిన్ బేగం కుమార్తె ఆసిఫాకు తీవ్ర గాయాలు కాగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న షిరిన్ బేగం.. కుమార్తె చనిపోయిందని తెలిసి స్పృహ తప్పి పడిపోయారు.