అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగుల తొక్కేయటంతో ముగ్గురు భక్తులు చనిపోవటంపై పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో పవన్ సమీక్ష నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని శివాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ సహకారం తీసుకోవాలన్నారు. అలాగే ఏఐ సాయంతో అటవీ ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.