ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఓ నిరుపేదకు గుండె సర్జరీ జరిగింది. గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి.. సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు. లోకేష్ చొరవను వైద్యులు, నేతలు అభినందిస్తున్నారు. ఓ ప్రాణాన్ని కాపాడిన లోకేశ్‌ను పొగడ్తలతో ముంచెత్తున్నారు.