నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో గుడిలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధ రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు.. హుండీలో డబ్బు కాజేసే ప్రయత్నం చేశారు. హుండీ తెరుచుకోకపోవటంతో హుండీతో సహా వెళ్లిపోవాలని ప్రయత్నించారు. కారు డిక్కీలో హుండీ వేసుకుని వెళ్తున్న సమయంలో కారు అకస్మాత్తుగా పంక్చర్ అయ్యింది. ఈలోపే అటువైపు స్థానికులు రావటంతో దొంగలు ఇద్దరూ కారును, హుండీని వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.