కొత్త పెన్షన్లపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి పెన్షన్లు మంజూరు చేయాలని సెర్ప్ సంస్థ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులను గుర్తించి ఎంపిక చేయాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల పెన్షన్లు పంపిణీ చేయాలని సర్కార్ టార్గెట్‌గా పెట్టుకోగా.. ప్రస్తుతం 3 లక్షలకు పైగా లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. మరో 2 లక్షల కొత్త అఫ్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.