గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో పథకం.. ప్రభుత్వం విస్తృత చర్యలు..

10 months ago 27
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17.5 లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘ఉదయం అల్పాహార పథకం’ రాబోయే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుంది. తమిళనాడు మోడల్‌ను అనుసరించి.. ఈ పథకం కింద విద్యార్థులకు పోషక విలువలు గల అల్పాహారాన్ని అందించనున్నారు. దీనికి సంవత్సరానికి సుమారు రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్న భోజనానికి అదనంగా ఈ ఉదయం అల్పాహారం అందించడం వల్ల హాజరు శాతం పెరుగుతుందని.. పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article