సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బైబిల్ పఠనం, ప్రార్థనల వ్యవహారం వివాదంగా మారింది. విద్యార్థినులతో బలవంతంగా ప్రార్థనలు చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల బెడ్లపై బైబిల్ పుస్తకాలు కనిపించడంతో అధికారులను ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.