Sircilla Residential school: తెలంగాణలో గురుకుల పాఠశాలలను పాము కాటు భయం వెంటాడుతోంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గురుకుల హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న బాలుడు అనారోగ్యంతో పడుకోగా.. నాగు పాము కాటేసింది. విద్యార్థుల పెట్టెల చాటున ఉన్న పామును గ్రామస్థులు కర్రతో కొట్టి చంపేశారు. బాలుడు రోహిత్‌ను ఎల్లారెడ్డిపేట ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో వరుస విషాద ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.