ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, గూగుల్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అయితే గూగుల్ డేటా సెంటర్ విశాఖలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.