కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్ నేతలను కాదని, అంబేద్కర్‌నని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కేటీఆర్ నివాళులు అర్పించారు.