తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. చదువుల తల్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. తన కుమారుడు ప్రతీక్ పేరు మీద పెట్టిన ఫౌండేషన్ తరపున తరచూ ఏదో ఒక సేవ చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలో మాస్టర్స్ సీటు వచ్చినా సరే.. వెళ్లేంత ఆర్థిక స్థోమతలేని ప్రణవి అనే యువతి పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. ప్రతీక్ ఫౌండేషన్ తరపున ప్రణవికి ఆర్థిక సాయం అందించిన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.