గొర్రెల పెంపకందారులకు సర్కారు భరోసా.. కొత్త బీమా పథకం, ఏడాదికి రూ.13 చెల్లిస్తే చాలు

4 weeks ago 12
తెలంగాణలో గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని ప్రారంభించింది. ఒక్కో జీవానికి ఏడాదికి రూ.13 చెల్లిస్తే, మిగిలిన ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కరీంనగర్‌లో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం తొలి మహాసభలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా గొర్రెలు, మేకల పెంపకాన్ని విస్తరించాలని మంత్రి సూచించారు. సొసైటీల రుణ బకాయిల మాఫీకి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వృత్తిదారులకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా వర్తింపుపై నెల రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు.
Read Entire Article