గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమణల తొలగింపునకు హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. మెరుగైన రవాణా సౌకర్యాల కోసం వందల నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లకు అడ్డుగా గోడలు కట్టిన గేటెడ్ కమ్యూనిటీలపై హైడ్రా చర్యలు మొదలుపెట్టింది. తాజాగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్లంపేట-బాచుపల్లి మధ్య ప్రణీత్ ఆంటిల్యా కాలనీ కట్టిన అడ్డుగోడను హైడ్రా తొలగించింది. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని.. దారిని అడ్డుకోవద్దని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజల ఏళ్లనాటి పోరాటానికి న్యాయం దక్కింది.