దేవాదుల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి .. మంత్రులతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం అక్కడ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్తితే వచ్చేది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 960 టీఎంసీల సరిపడా ప్రాజెక్టులు లేవని, అప్పుడే ప్రాజెక్ట్‌లు కట్టి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అన్నారు. అయితే, వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని అన్నారు.