గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్.. సచివాలయ సిబ్బంది హాజరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేసింది. అటెండెన్స్ మొబైల్ యాప్‌లో హాజరు నమోదు తీసుకోనున్నారు. అయితే గతంలో ఒకసారి నమోదు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు సచివాలయానికి వచ్చినప్పుడు .. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు రెండు సార్లు హాజరును మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి రెండు ఎంట్రీలు నమోదు చేసినా.. లేదా.. ఒక్క ఎంట్రీ మాత్రమే నమోదు చేసినా ఆ రోజును సెలవుగా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు.