నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మూడు హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి శంకుస్థాపన చేశారు. పెద్దకొత్తపల్లి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో మొత్తం 19.35 కిలోమీటర్ల మేర రహదారులను రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 6.95 కిలోమీటర్లు, పాన్‌గల్‌లో 4.40 కిలోమీటర్లు, వీపనగండ్లలో 8 కిలోమీటర్ల రహదారులు నిర్మించనున్నారు. ఈ రహదారులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.