ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం కొంగరకలాన్ నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సాకిబండ తండాలో 67.12 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ రహదారి మీర్‌ఖాన్‌పేట సమీపంలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీని కనెక్ట్ చేస్తూ.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించనుంది. పారిశ్రామిక వృద్ధికి, వేగవంతమైన ప్రయాణానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.