తెలంగాణలో ఎట్టకేలకు నాలుగు సార్లు వాయిదా తర్వాత మళ్లీ తాజాగా.. గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారితో సుమారు లక్ష మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేదని తెలుస్తోంది. చేసుకున్న వాళ్లలో కూడా చాలా మంది.. ఈ నిమిషం నిబంధనతో పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఇందులో ఓ ఇద్దరు అభర్థుల పరిస్థితి అయితే మరీ ఘోరం. అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా.. చివరికి గూగుల్ తల్లి నిండా ముంచేసింది.