హైదరాబాద్‌లో ఘట్‌కేసర్‌లో రోడ్డుపై కారులో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదానికి గురైన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారు. అయితే.. అందులో అబ్బాయి గురించిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించగా.. యువతికి సంబంధించిన వివరాల గురించి ఆరా తీసినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని.. దీని వెనుక పలు కారణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.