ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి.. అసలేం జరిగింది?

2 months ago 12
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చి హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో నివసిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు రవికుమార్, శిరీష.. ఘట్‌కేసర్ - బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్‌ఎఫ్‌సీ సమీపంలో రైలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఛిద్రమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article