రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. చేవెళ్లలోని బస్టాండ్ దగ్గర అదుపుతప్పిన ఒక సిమెంట్ ట్యాంకర్, ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రోడ్డు భద్రతపై మరింత దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.