సిద్దిపేట జిల్లా పరిధిలోని జక్కాపూర్ శివారులో రాంగ్‌రూట్‌లో అతివేగంతో వచ్చిన ఒక కారు, బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త జడల తిరుపతి అక్కడికక్కడే మరణించగా.. భార్య రజిత తీవ్రంగా గాయపడింది. ఈ భయంకరమైన దృశ్యాలు వెనుక కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. కారు డ్రైవర్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా జరిగిన ఈ ప్రమాదం రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.