చందానగర్‌లో ATM చోరీకి యత్నం.. ఈ దొంగ చేసిన పనికి నవ్వాగదు..!

1 year ago 36
కొందరు దొంగలు చేసే పనులు హాస్యాస్పదంగా ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఇలాంటి విచిత్ర చోరీ యత్నం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. పదునైన ఆయుధాలతో మిషన్‌ను బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశాడు. చెమటలు చిందించినా.. ప్రయోజనం లేకపోవడంతో అలసిపోయి అక్కడే నిద్రపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ముంబైలోని బ్యాంకు కేంద్ర కార్యాలయం అలర్ట్ చేయగా.. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article