Sonu Sood On Chandrababu 100 Days: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తయ్యింది. అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే చంద్రబాబు తన విశిష్ఠ పాలనతో.. ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చర్యలు చేపట్టారని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. చంద్రబాబుకు పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉందని.. ఆయన తన చక్కని విజన్‌తో రాష్ట్ర భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని.. త్వరలోనే ఆయన్ను కలుస్తానని చెప్పారు.