ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల విషయం మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసింది. తెలంగాణ సర్కార్ తీరు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తన గురువు చంద్రబాబు కోసం.. తెలంగాణ జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులు కాలరాస్తుంటే.. బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.