పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తుంటారు. ప్రత్యర్థి విమర్శలను పట్టించుకోకుండా.. బాబుతో స్నేహానికే మొగ్గు చూపిన జనసేనాని.. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో ఫలితాలు సాధించారు. అనంతరం డిప్యూటీ సీఎం పగ్గాలు కూడా చేపట్టారు. అయితే లోకేశ్‌ను కూడా డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేయడం జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ఇది కాస్త ఇరు పార్టీల మధ్య సోషల్ వార్‌కు కారణమైంది.