ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 75 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడేలా రెవెన్యూశాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో 1.12 కోట్ల పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్త చట్టం తేవాలని స్పష్టం చేశారు.