ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పరిస్థితిపై దృష్టి సారించారు. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకుండా ఉన్న 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు.. పార్టీ వర్గాలను ఆదేశించారు. వారి నుంచి వివరణ వచ్చాక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.