వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్న అడిగితే వైఎస్ జగన్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు అంటూ వీడియో వైరల్ అవుతోంది. అయితే దీని వెనుక వాస్తవాలను కనుగొనేందుకు ఫ్యాక్ట్ చెకింగ్ నిర్వహిస్తే.. వైరల్ వీడియో అబద్ధమని తేలింది. అసలు వీడియోలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నట్లు తేలింది.