రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, చంద్రముఖిలా మారిపోయారన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ మాఫియా నడుస్తోందని.. కుంభకోణాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందన్నారు. ఇలాంటి సమయంలో నేతలంతా గొంతు విప్పాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నారు. తాను నేతలందరికీ అండగా ఉంటానన్నారు. నాయకులుగా ఎదగడానికి ఇది ఒక అవకామని.. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని లేపడమే అన్నారు. వైఎస్ జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యాని పెడతాడని ప్రజలు భావించారన్నారు. ఇప్పుడు ఈ రెండూ పోయాయని.. ఉన్న పథకాలు పోయాయన్నారు. ఇస్తానన్న పథకాలూ అమలు చేయడం లేదన్నారు.