Ys Jagan Mohan Reddy On Vision 2047: విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారన్నారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు. తన పరిపాలనలో మొత్తం మూడు విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా ? అంటూ ప్రశ్నించారు.