Chandrababu AP Skills Development Case Ed Clean Chit: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. గత జగన్ సర్కార్ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై నమోదైన ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ స్పష్టం చేసింది. పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తులో ఆయన పాత్ర లేదని తేల్చింది.