డీ లిమిటేషన్ అంశంపై సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేత శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శశిథరూర్ పోస్టుకు కౌంటర్ ఇచ్చారు. మూడు అంశాలతో డీ లిమిటేషన్ బిల్లు అంశంపై శశిథరూర్ పోస్టుకు రిప్లై ఇచ్చారు లోకేష్. డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.