Gaddam Prasad Kumar Meet Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఆదివారం చంద్రబాబును హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లెటర్లపై రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల దర్శన సిఫార్సు లేఖల్ని కూడా ఆమోదించాలని కోరారు.. పరిశీలిస్తామని చెప్పిన చంద్రబాబు