హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే టెర్మి్నల్ అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. సుమారు రూ.430 కోట్లతో ఎయిర్ పోర్టును తలదన్నేలా అత్యంత ఆధునిక సదుపాయాలతో నగర శివారులోని చర్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా.. ఈ టెర్మినల్‌ను శనివారం (నవంబర్ 28న) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైశ్ణవ్ ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే.. శివారు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ప్రయాణికులకు భారీ ఉపశమనం దొరికే అవకాశం ఉంది.