ఎండల తీవ్రతతో కూలర్ల వినియోగం పెరగగా.. ఇనుప కూలర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తుప్పు పట్టడం, విద్యుత్ తీగలు దెబ్బతినడం వల్ల కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉండే సమయంలో జాగ్రత్త అవసరం. ఇనుప కూలర్లు కొన్నవారు కనెక్షన్ వద్ద విద్యుత్ సరఫరాను పరీక్షించాలి. ఐదేళ్లు దాటిన కూలర్లను వాడకపోవడం మంచిది.